బావా......😍
ఏంటి బుజ్జీ పిలుపుమారిందని ఉలికిపడి కింద పడలేదు కదా....
ఎందుకో పిలవాలనిపించిందోయ్...ఒక పేరుతో ఎలా సరిపెట్టను నిన్ను...కుదరదు కదా...
ప్రియమైన నేస్తానివి...నాలో ఉన్న నా మనసువి ముఖ్యంగా నా ఆజన్మ శత్రువ్వి కదా...
కాదా, కలిసుండలేని స్థితి అని తెలిసి కోరి కోరి వచ్చి మరీ కలిసిపోయావు నా ఈ జన్మలో ఒక భాగంగా...
ఏ జన్మలోని ఎడబాటో ఇలా కలొసాము అనుకోనా...హ్మ్ ఇప్పుడు మాత్రం అందీ అందని ద్రాక్షలానేగా కలిపింది..
ఎన్నినాళ్ళ ఎదురు చూపులో ఇవి....నన్ను నేనే దాచిపెట్టుకున్న నీకోసం భద్రంగా....
నా మనసుకి నన్ను నేనుగా నీకు అప్పచెప్పేసుకున్న..
నువ్వు ఒక కన్ను కొడితే నేను రెండు కళ్ళు కొట్టగల గడసరిని...
నీకోసం ఏం చేసినా...ఎంత కష్డమైనా ఇష్టమేనోయ్
ఓయ్.....వింటున్నావా లేదా అని పిలాచాలేవోయ్
ఎలా ఎన్నిసార్లు పిలిచినా పెదవులకు అలుపే రాదుగా..
కాస్త ఈ లోకాన్ని పక్కన పెట్టి ఇటు చూడొచ్చుగా..
నా బుంగమూతి చందాన్ని, నా ఆకతాయి పనులను అన్నింటికి మించి...
నీ ప్రేమ కాని ప్రేమకు నేను ఒక వ్యసన పరురాలిని కదా..
నీ పిలుపు వినని రోజును, నా ఙ్ఞాపకంలో నుండి తీసి పక్కన పడేస్తాను...
నువు ఇంతేసి పళ్ళు వేసుకొని నవ్వుతావే అదే అందరిని చూసి..
బుజ్జీ ....నిజంగా నీ కళ్ళకు గంతలు కట్టేయాలనిపిస్తుంది..
నేను మాత్రమే నీకు కనిపించాలనే పిచ్చి కోరిక ...
ఏంటోయ్...ఉలుకు పలుకు లేకుండా ఆ చూపులు తినేస్తావా ఏంటి...
కాస్త ఆ చూపులు చాలించి నాలుగు చల్లని కబుర్లు చెప్పవోయ్...విని చాలారోజులు అయింది
ఏమున్నాయి అనకు...ఏమున్నాయి అని లొడలొడ వాగుతున్నాను నేను...
ఎదురుచూపులన్ని ఎండమావులు చేయకోయ్...
కలలోనే నయం కలగలసి కలిసిపోతావు నాలో, మొదటి కలలో ఎలా ఉన్నావో ఇప్పుడు అంతే...
బుజ్జీ...నిన్నే వినిపిస్తుందా ...ఈ సైగకు అర్థం అర్ధమయిందా లేదా...
ఏంటని అడగకు అర్ధంకాకపోతే పో ఇంక....
..............అరుణని............
No comments:
Post a Comment