అప్పుడెప్పుడో నన్ను నేను వెతకడం మొదలుపెట్టాను
ఇప్పటికి వెతుకుతునే ఉన్నాను....నా కోసం నేను !!
కోరిన వారి వెంట వెళ్ళడమే కాని..తనకోసం తాను వెనుతిరిగి చూడదా ఈ మనసు...
నీకు చోటిచ్చిన ఈ పిచ్చి మనసు ఏకాకిలా మిగిలింది..
నీరాక ఆశలను చిగురింప చేస్తుంది...ఎన్నాళకో నన్ను నేను మళ్ళీ కలుసుకున్నాన అన్నట్లుగా..
ఎందుకు వచ్చావో కారణం తెలియని వెర్రిదానిని కదా
అందుకే ఆశలన్నింటికి మళ్ళీ ఊపిరి పోస్తాను...
కాని నావి వెర్రి ఆశలని అంతలోనే తుంచి మరీ నాముందు పడేసిన ప్రతీసారి
వాటికి నాకంటూ మిగిలిన ఆయువునే పంచి ప్రాణం పోస్తుంటాను... కారణం అవుంటేనేగా నేనుండేది...
నువ్వు దూరంగా జరిగిన ఆ ఘడియలలో నాకు నేను కానరాక ...కన్నుల నిండిన ఊటని ఆపలేక
చెంపలపై జారిన కన్నీటి చారికలను తుడిచేయడానికి..
భారమైన నా ఎదకు ఓదార్పునిచ్చి ..నను స్థిమిత పడేలా చేసేవి నీ ఙ్ఞాపకాలే కదా...
కాని అవి ఎక్కడ ఉన్నాయి,ఎన్నున్నాయి..
నేను నీకు అవసరాన్నా,ఇష్టాన్నా ఇది తెలుసుకోవడంతోనే కాలం గడచిపోయింది..
అసలు నీకేం కావాలి అంటుంది నా మనసు..
ఏం చేస్తున్నావంటూ ప్రశ్నిస్తుంది...నీ, మీ ఆటలో నేను కీలుబొమ్మనా, తోలుబొమ్మన నేనేమవ్వాలి అంటుంది..
నిజమే ...నా మనసు కోరిన మనసుకు స్థిరమనేదే లేదు
ఇంక నన్నెలా స్ధిరంగా ఉండనిస్తుంది...
తెలుసుకోడానికి ఏముంది ఇంకా మిగిలి.. నువ్వింతే అని తెలిసాక...
అందుకే విన్నవి,చూసినవి అన్నీ చిరునవ్వుతో వాడంతే అంటూ పక్కకు నెట్టేస్తున్నా...
నువ్వు ఎన్నాళ అతిధివో నీకే తెలియదు ఇంక నాకేం ఎరుక...
నాకు ఙ్ఞాపకాలు కావాలి రేపు నేను జీవించటానికి నీతో..
నీతో ఉన్న ప్రతిక్షణాన్ని సంతృప్తిగా నేను నేనుగా అనుభవించాలి...
ఒక జీవితాన్ని నీతో నేను ఆ కొద్ది ఘడియలలో జీవించాలి...
నువ్వు ఏం పొందావో...పొందుతున్నావో...పంచుకుంటున్నావో..దాచుకుంటావో నాకు తెలియదు...
నువ్వు తాకిన నా ఆత్మ...రేపు ఇంకొకరి నీడను కూడా తాకదు...నువ్వు ఉన్నా లేకున్నా నా దగ్గర అది నీ సొత్తు..
అందుకే...అటు ఇటు ఎటు చూడనంటూంది నా మనసు ఏం కావాలో రేపటి నీ ఒంటరి ప్రయాణానికి అవన్నీ అందుకో అంటుంది...
అందుకే నీ ఇష్టాలను నా ఇష్టాలు చేసుకున్న...నేనే నీలా మారి నీ ముందర ఉన్నాను
నాకు నువ్వు అనే అనుభవం కావాలి...నిన్ను నిన్నుగా పొందాలి....నీతో ఉన్న ప్రతీ నిమిషాన్ని నేను దాచుకోవాలి..
నా రేపటికి నిన్ను నా బలంగా మలచుకోవాలి...
ఎప్పుడైనా ఒక్కసారి గుండెల మీద చెయ్యవేసుకొని ప్రశ్నించుకుంటే నువ్వు.. నిన్ను నిన్నుగా ప్రేమించింది ఎవరని ...నీ కళ్ళముందు నేనే ఉంటాననే నమ్మకం నాకుంది..
నిలకడలేని నీ మనసుకు కూడా తెలుసు ఆ సంగతి నీకు తప్పించి
ఇప్పుడు నాకు కనిపించేది నువ్వొక్కడివే...ఈ లోకం కూడా నాకు అక్కర్లేదు..
ఎంత స్వార్ధపరురాలిని అయిపోయానో కదా..నీ సహవాస దోషం..
.............అరుణని..............
No comments:
Post a Comment