Wednesday, 19 April 2017

తాను నేను

అలా నాలుగు అడుగులు  కలిసి నడవవోయ్
రేపన్నది ఎవరికి ఎరుక...
ఈ క్షణానికి మనదనే ముద్రను వేసేద్దాం...
రేపన్న రోజున వెనుతిరిగి చూస్తే ఈ ఘడియలు మధరుమైన ఙ్ఞాపకాలై పెదవిపై చిరునవ్వును అద్దాలి...
ఈ నాలుగు అడుగులు నా ఎదను నిండిపోవాలి...
ఈ సాయంత్రం ఇలా వీడ్కోలు చెప్పే ఆ సూర్యుడు
తెల్లని వెన్నెలను మొసుకొస్తున్న ఆ జాబిలి
అలసిపోని ప్రయాసకు మరో పేరై ఈ అలలు అందరిని మరచిపో...
నువ్వు నేననే ఈ ఏకాంతాన మాటలు కూడా వద్దు
ఈ మౌనం చాలు...ఏమున్నాయి చెప్పడానికి
నీపై నాకున్న ప్రేమను వివరించడానికి మాటలే కరువై పోయాయి...
కలకాలం సాగని ఈ పయనాన్ని నిందించడానికి కూడా మనసు ఒప్పట్లేదు
ఎవరిని నిందించలేను నీకు దూరంగా ఉండలేని నా మనసును తప్పించి
ఈ క్షణం నుండి నీకు నాకు సంబంధం లేదనుకుంటాను ...
మాట తప్పడం ఎరుగని దానినే కానీ
నీ విషయంలో మాట తప్పను అనే మాటను తప్పుతునే ఉన్నాను....
అందుకే అందిన ప్రతీ ఘడియను దాచేసుకుంటున్నాను..
మాటలన్నీ అయిపోయాయేమో కదూ అందుకే ఇప్పుడు నీ మౌనం కూడా నాతో మాట్లాడుతుంది...
ఒకరిలో ఒకరం కలిసిపోయాం కదూ అందుకే ఇప్పుడు నువ్వండే దూరం కూడా నాకు దగ్గరగా ఉందోయ్...
తప్పించుకుని తిరుగుతుంటే మా ముద్దుగున్నావోయ్...
నాకింత ఉడుకుబోతు తనం ఉందని నువ్వొచ్చే వరకు తెలియదురా...
నీతో తిట్టించుకున్నా ఇష్టమే సుమీ...
నేను అనగలిగేది నిన్నే, పడగలిగేది నీతోనే కదా...
ఏయ్....ఈ నాలుగడుగులు నాలుగు యుగాల కాలం అయితే బాగుండేది కదూ...
నీతో అదే నా మనసుతో మాట్లాడుతుంటే అలా ఈ అలల్లా విసుగంటు లేకుండా అమృత వాహినిలా ఊరుతునే ఉంటాయి...
సరే పో ఇంక....ఎక్కువ మాట్లాడిన, చెప్పిన మీ మగాళ్ళకు విసుగే కదా...

............అరుణని.............

No comments:

Post a Comment