ఆరుబయట ముగ్గుల లోగిలిలో
నా మనసుతో ముచ్చటగా కబురులు చెప్పుకుంటుంటే
మధ్యలోకి వచ్చాడు ఈ వెన్నెల రాజు 😍
ఎంతసేపు ఆ మనసుతోనేనా...ఇటు చూడు అంటూ కసురుకుంటున్నావేంటోయ్...
చాలా రోజులే అయిందిలే నీతో మాట్లాడి
ఏంటి....చెప్పవోయ్ విశేషాలు
రోజుకో తారతో నీవుంటున్నావే మరి నేనెంత ఉడుక్కోవాలి మరీ...హా
నీ వెన్నెల వేడి నను నును వెచ్చగా తాకుతోంది
నా చుట్టూ పరిచిన నీ వెన్నెల పానుపు చూడు..ఎలా ఎదురు చూస్తుందో
వెన్నెల వానలో ఎంతసేపు ఇలా తడిపి తాపమెక్కిస్తావోయ్...
నిండుగున్నావోయ్ పసిడి మేనిలో ...ఆ మచ్చలలో మా ముద్దుగున్నావు...
ఏంటోయ్ ఆ సిగ్గు, మబ్బులు చాటుకెల్లి దోబూచులాడుతున్నావు...
సైట్ కొడితే ఎవరన్నా అలాగే ఉంటదోయ్...తెలుసుకో
ఆడదాని కొంటె చూపులు తప్పించుకునే మగడు ఉన్నాడ
తడిమి తడిమి చూసే మగడి చూపులను తప్పించుకునే పడతి ఉందా...
ఇంతలో వచ్చాడు ఆ గాలిగాడు...
వస్తూ వస్తూనే చెంపలను తడిమి ముద్దిడి
మెడవంపులను సుతారంగ తాకుతూ నా కురులను సవరిస్తూ....నన్నెలా మరచిపోయావు అంటూ నసిగాడు..
నీతో నే వేగలేనురా బాబు...మాట వినవు కదా అందుకే ఈ మరుపు అంటుంటే...
అవునా అంటూ నను చుట్టుముట్టేసి కట్టేస్తున్నాడు...కసురుకోని నన్ను వదిలేయరా బాబు ఇంక ఉంటాను అంటే...
ఓయ్...ఎక్కడికి నేను లేకుండా...నీ వెంటే నేను మరిచావా నన్ను...నిను ఆక్రమించేసాను ఏనాడో నీ శ్వాసనై గురుతులేదా.....ఎప్పటికి గుర్తిస్తావు మరి
నీ వెంట నేను...నీ జంటనై ఉంటా అమ్మడూ ...ఎప్పటికీ
ఈ గాలి గాడి...గోల నీకు తప్పదు అంటూ ఉంటే...
చాల్లేవోయ్...మాటకారివంటూ నేను నవ్వే నా ముసిముసి నవ్వులకు నువ్వెప్పుడు నా దాసుడివే..అందుకే నీకు దాసోహం అయ్యేది నేను
ఇంకా బోలెడు కబురులు ఉన్నాయి కాని...అన్నీ చెప్పాల ఏంటి..ఇంక చాలబ్బ
ఇలా సాగింది ఒక రేయి...మా ముగ్గురి అల్లరితో
ప్రేమించడానికి మనసుంటే చాలు...
కోరికలకు తనువుంటే చాలు...
కోరికలతో పుట్టే ప్రేమ కాదెప్పటికి సొంతం..
ప్రకృతిని ప్రేమిస్తే ఇవన్నీ మీ సొంతమేనండోయ్....
...........అరుణని...........
No comments:
Post a Comment