ఓయ్........అర్ధమయిందా
నేను నీ ప్రతిబింబాన్ని అని
నువ్వు ఒక నవ్వుని ఇవ్వవోయ్
చిరునవ్వులు చిగురిస్తాయి ఇక్కడ
నువ్వు మౌనాన్ని ఇస్తే
నా పెదవి చిన్నబోతుంది ఇక్కడ
ఒక్కమాట నువ్వు మాట్లాడితే చాలు
తెలుసుగా ఇక్కడ ఉన్నది వస పిట్టని
నీ నిర్లక్ష్యం ఇక్కడ తగదయ్యా
నను నిలువునా దహించేస్తుంది
అందరితో సరదాగా ఉండవోయ్
ఆ అందరిలో నేను లేకపోతే ఎలా
అసూయకు కూడా జాలేస్తుంది
నా దుఃఖాన్ని చూసి
నువ్వు నీలా ఉండంటూ అనకోయ్
నేను నాలానే ఉన్నాను కాకపోతే
నాలో నువ్వున్నావంతే...
నీ నుండి దూరంగా జరగగలను కాని
నా నుండి నేను వేరయి ఎక్కడికి పోనూ
అప్పుడు మనం ఇప్పుడు మనమే
ఎప్పటికీ నాతో నేను....నాలో నేను
ఏయ్.....వినిపించిందా
ఇటునుంచి విని అటునుండి వదిలేస్తావులే
ఇది నాకు నీకు అలవాటేగా
.........అరుణని.........
No comments:
Post a Comment