నీ ఆలోచనలను అదుపుచేసే అవకాశం ఉందా...
ఉంటుంది నువ్వు వదిలి వెళ్ళిన స్థానం మరొకరికి ఇస్తే ...
కాని ఇదేమన్నా కాళి చేసిన ఇల్లా...నా మనసోయ్
ఇది మహా పెంకిది...లొంగక లొంగక లొంగిందోయ్ నీకే...
కాలాలు, ఋతువులు మారినట్టుగా మనుషులు మారుతారు నిజమే కాని మనసులు ఎలా మారుతాయి ...
నువ్వు దూరంగా ఉన్న రోజులలో కూడా నీ ఆలోచనలు నాకు దూరంగా లేవోయ్...
అనుక్షణం నా ఊహల్లో ఊరిస్తూ, నా కలల్లో కలిసిపోయి,నా చేతలలో, నా మాటల్లో ఇలా నువ్వు లేని చోటు ఎక్కడ ఉంది నాలో ....
నేనే నీవై పోయాక ఇప్పుడు నువ్వు నేను వేరంటుంటే...ఆ మాట నా మనసు విననంటూ మారాం చేస్తుందోయ్..
స్నేహం ప్రేమగా మారడం కష్టం కాదుగాని మళ్ళీ ప్రేమ నుండి స్నేహంగా మారడం అంటే ఇంకో జన్మ ఎత్తాలేమొ కాని ఈ జన్మకు అది సాధ్యం కాదురా...
నిన్ను చూసిన స్థానంలొ ఇంకెవరినైనా చూడగలవా ఈ కళ్ళు ...
నిన్ను ఉంచిన స్థానం ఇంకొకరికి ఇవ్వడం కుదరదు కాని ముందు నిన్ను ఎలా సాగనంపేదిరా....
దూరంగా నీకు ఉండగలను కాని నిన్ను దూరం చేసుకోవడం అంటే నాకు నేనే మిగలనేమొ చివరికి...
నా ఎదలో నుండి నిన్ను పంపడం అంటే దాని ఆయువుని ఆపేయడమే తప్ప ఇంకోదారి ఏది...
నీ ఙ్ఞాపకాలు దానికి ఊపిరి పోస్తున్నాయి చూస్తూ చూస్తూ ఉసురు ఎలా తీసేయను....
నా అక్షరాలలో భావానివై నా బాధను నీ బాధ్యతగా భరిస్తున్నావే ఎలా వాటిని బలి చేసేయను...
రాసే ప్రతీ అక్షరాన్ని నా కన్నీళ్ళు అభిషేకిస్తునే ఉన్నాయి...కాని ఆ భారం ఇంకా అలానే ఉందోయ్...
ఎవరికి విన్నవించేది.. ఈ ఏకాంతానికి,ఆ వీచే గాలికి,మౌనంగా చూస్తున్న ఆ రేడుకి ఇవేగా నాకున్న నేస్తాలు...
నా ఎద సొదను విసుగు లేకుండా వినేది అవేగా...
మన ఇద్దరి గాదకు సాక్ష్యులు వాళ్ళే ఈ రోజు నాకు నేస్తాలుగా నన్ను వదలలేని నా ఆత్మీయులు వాళ్ళే...
జీవితకాలం నీ అనుభవాల భారాన్ని ఇలా నా ఏకాంతం సాక్షిగా మోసుకుని,నా గుండెల్లో ఉన్న నీ తోడుని తోడుగా చేసుకొని ఇలా.....
నాతో నేనుగా.. నా మనసుతో నేను ఎంతవరకు సాగగలనో ఆ కాలానికి అప్పచెప్పేసాను మౌనంగా..
..............అరుణని................
No comments:
Post a Comment