Thursday, 30 November 2017

తాను నేను

పలుకే బంగారమాయే నేడు....
ఎందుకు ఈ సమయం ఇంత సద్దు చేస్తుంది....
మన మాటలతో సడి చేసిన చోటేమో నేడు మౌనంతో రాజ్యమేలుతోంది....
ఈ మనసుకు నువ్వు వేసిన మూడుముళ్ళతో నీకు ఈరోజు పనిలేదు కాని....
ఆ మూడుముళ్ళూ ఇన్ని చిక్కుముడులు అయ్యాయి ఏంటోయ్....
సరిచేయలేక,అలాగని విప్పలేక,బయటపడలేక ఈ మనసుకు ఎందుకు ఇన్ని చిక్కులు....
ఊపిరాడనంత చిక్కులు ఇచ్చి ఏరు బాగా దాటేసావురా....
ఉన్నాను ఇలా, కళ్ళతో కాదు మనసుతో చూడగలిగితే చూడవోయ్...
మాటలకు కొదవేముంది ఇక్కడ కాని మనసు మూగబోయి ఆ మాటలకు ప్రాణమే లేదు నేడు...
నవ్వులకు కరువే లేదు కాకపోతే ఆ నవ్వుకు జీవం పోయింది నేడు...
కళ్ళనిండా ఎదురు చూపులే...చూసి చూసి కనుపాపలు ఎక్కడ  అలసిపోతాయి అనేమో కనులు నిండుగా ఊరుతునే ఉన్నాయి....
చేతి గీతగా వచ్చి చేతి రాతవై నేడు చెలిమి చేస్తున్నావు ఇలా అక్షరాలుగా....
గడిపిన గత కాలానికి ఒక విలువ ఉంది మన చెలిమిలో...నేటి ఈ కాలం నా నిట్టూర్పులో ఆవిరై పోతుంది ఇలా....
ఏంటో ఈ ఎదురుచూపుల ఏకాంత సమీరాలు ఏ తీరం చేరేనో....

..............అరుణిమలు...............

No comments:

Post a Comment