Saturday, 2 December 2017
తాను నేను
నా కథలో మలుపువు నువ్వు..
నేను ఊహించని ముగింపువు నువ్వు..
అర్ధానికి అర్థం కాని అద్దానివి నువ్వు..
పేరుకి మాణిక్యానివి మాటలకు అందని చేతలకు చిక్కని చెలికాడివి నువ్వు...
ప్రేమకు నానార్ధాలు చూపించిన గడసరివి..
మాటల మంత్రగాడివి ముంచి తేల్చేయడంలో...
నిలబడతావు నీడనే మా నీడల్లో క్రీ నీడ గా...
మాట తప్పవే మాట మీద నిలబడనంటూ...
అందరికి అయిన వాడివే కాని తరచి చూడనంత వరకు..
ఏమర్చగలవు నిను నువ్వు పోగొట్టుకున్నాను అనేంత..
అవును...ఎవరు నువ్వు ??
నేను మరచాననే నా గత మనసువి..
భ్రమలోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా బయట పడేసిన నా అనుకున్న ఒక మనిషివి కదా...
లోకమంత ఒకపక్క, నువ్వు ఒకపక్క నాకు అప్పుడు...ఇప్పుడు కూడా...
కాని నువ్వు అనే ఆశ మాత్రం లేదిప్పుడు...
లోకం చాలా విశాలంగా కనిపిస్తుంది అందులో నిన్ను వెతకాలని లేదు ఈనాడు...
మనసంటే అలుసు కదా కూసిన్ని మాటలను నమ్మి మైమరిచిపోయి నీవసం అయి నీముందు మోకరిల్లుతుంది అని...
మనసు భాషే కాదు దానిని ఆడించడం ఎరిగిన నీకు అది చెదిరితే ఏమౌతుందో మాత్రం తెలియదు ఎందుకు...
నీకు పూచిన పువ్వును తుంచడం మాత్రమే ఇష్టం కాని నీరు పోసి సాకడం కష్టం కదూ...
ఓయ్ షేక్స్పియర్ నీ మాటలు నీటి మూటలోయ్ ...
✍️అరుణిమలు
No comments:
Post a Comment