Saturday, 2 December 2017
తాను నేను
భవిష్యత్తు ఏంటి తెలియదు కానీ...
కాలం అయితే కదిలి పోతుంది...
ఎన్నో అనుభవాలు మరెన్నో ఙ్ఞాపకాలు మధ్య
నన్ను కదిపి,కదలనివ్వని ఆలోచనలు మాత్రం నీవే...
ఎందుకొచ్చావనే ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది...
గాలికి ఎగిరొచ్చి నీ చేతిలో పడిన చిత్తు కాగితాన్ని అనుకున్నావా...
ఇష్టం వచ్చినట్లు నచ్చినట్టు గీసేసి నీ ఇష్టాలను...
కోపం వచ్చినప్పుడు చింపేసి...
నీ అవసరం తీరాక విసిరేసి పోవడానికి...
ఆడుకున్నావు కదూ బొమ్మను చేసి...
అందుకే అంతు లేని కన్నీటి సంద్రంలో తీరం తెలియని ప్రయాణం చేస్తుంది నా మనసు...
ఓయ్ ఆడటానికి నీకేం హక్కు ఉందయ్యా...
నీ చేతిలో ఊపిరి పోసుకోలేదు ఈ ప్రాణం నీ ఇష్టం వచ్చినట్లు నలిపేయడానికి...
గాలివాటు మనిషిగా నిన్ను చూసుంటే బాగుండేది...
నా ఊపిరివి అనుకున్నాను పొరబడి అందుకే నీ ఆటలు ఉక్కిబిక్కిరి చేస్తున్నాయి...
నమ్మకాన్ని వాడుకున్నందుకు నిన్ను ఏమనాలో ఏమో...
నమ్మినందుకు అసహ్యంగా మాత్రం ఉంది నా మీద నాకు...
జీవితమనే నా ఈ పుస్తకంలో నువ్వనే మజిలీ శిలాక్షరాలుగా లిఖించుకొని తప్పు చేసాను...
చెరపలేను...చెదిరిపోలేను...ఛి అని నిన్ను అనుకోలేని ఈ పిచ్చి మనసును చంపేయను లేను..
✍️అరుణిమలు
No comments:
Post a Comment