పెంకి పిల్లను.. ఎంకి లా మార్చిన గడసరోడివి..
పాల నురగలను లేత బుగ్గలకు నిమిరి...
తేనె పూతలను పెదవులకు అద్ది...
మంచు పుష్పాన్ని ముక్కెరగా మలచి..
తూర్పు కొండల నడుమ నే అద్దిన నీ చూపులను...
మాపటేలకు పడమటి కొండల్లో విరిసిన రేరాజు వై...
వెన్నెల గందాన్ని అరగదీస్తూ... నుదుట నుండి జారవిడిచి.. చిగురాశలను చిత్తడి చేస్తూ..,.
పసిడి ప్రాయాన్ని నీ గుండెల మాటున దాచి..
మెల్లగా అస్తమించి....
ఆ పక్కకు చేరేవేంటోయ్ నా నెలవంక...
ఏ వంకలు లేని నిను తురుముకున్న కురులను తొలచి...
మళ్ళీ ఉదయించావు పెదవలుపై పలకరింపుగా...
ఏ జామో తెలియని మైకం కమ్మే మత్తువోయ్..
నీ సన్నిదిలో పగలు రాత్రి పాలు,పంచదారే...
✍️అరుణిమలు
No comments:
Post a Comment