Saturday, 2 December 2017
తాను నేను
ఆలోచనలు పరవళ్ళు తొక్కుతుంటే...
వాటి తీరాన ఇష్టమైన ఙ్ఞాపకాలను తలంచుతూ అడుగులు వేస్తున్న...
అలా అలా నడుస్తూ వెనుదిరిగి చూస్తే అడుగులు జాడలు లేవాయే...
మనసు నవ్వింది...కాలం గురుతులను కడిగేస్తూ ముందుకు కదులుతుందని మరిచావా అంటు..
అలా అలా వచ్చి పోయే అలలు లా..ఆలోచనలలో ఆటుపోటులు ఒకపక్క..
పాదాలను ముద్దిడే నీటి తరంగాలులా...మేను తాకే నీ ఊహల తాకిడి ఇంకొక వేపు...
వంపులు తిరుగుతూ రూపం మారే తీరాన్ని చూస్తే...నీ నిలకడ లేని నిర్ణయాలులా కనిపిస్తున్నాయి...
కోతకు గురువుతున్న ఒడ్డుకు నా మనసుకు తేడా ఏముందోయ్...
నీ ఇష్టాల ఫలితమే ఈ మది కోతకు కారణం...
కళ్ళు వర్షించడం మొదలయ్యాక తేరుకున్న మనసు ఏమయిందని ప్రశ్నించింది...
ఇందాక ఏరిన రంగు రాయి గుచ్చుకుందోయ్ అరిచేతిన..గులక రాయని ఇప్పుడు అర్థమయింది..
ఆ పరవళ్ళలో రాయిని విడిచి..చేయి కడిగి చూసా చేతి రేఖను మార్చేసింది ఆ గాయం..
ఇష్టంగా అందుకున్నది ఏమో కదా...గాయం లోతుగానే ఉంది...
కళ్ళలో నుండి జారుతున్న లవణ బిందువులను దాహం తీర్చుకోవడానికి అన్నట్టు..ఆ పరవళ్ళు పొదివి పడుతున్నాయి...
నువ్వనే ఙ్ఞాపకాన్ని తర్పణంగా వదిలేద్దామా అనుకున్న కానీ..
మెదడుకు అక్కడ ఎండిన నీటి చారల మరకలు మాత్రమే కనిపించాయి...
ఏం మాయే మనసా నీది...వదలనీవవు...ఉండనీవవు...గాయాలని మాననీవు
✍️అరుణిమలు
No comments:
Post a Comment