Saturday, 2 December 2017
తాను నేను
నిన్ను మరచిపోయానని అనుకున్న కానీ నన్ను నేనే మరచిపోయా అనుకోలేదు...
నిన్నే లోకంగా భావించి నువ్వనే ప్రపంచం నుండి బయటపడటం అంటే నన్ను నేనే కోల్పోవడమా...
అవునులే నువ్వే నా సమస్తమయ్యావు కదా ఆనాడు...
ఏకాంతం ఎంత హాయిగా ఉందో ఈరోజు...
నా ఆలోచనలకు ఆటంకం లేదు...నా ఊహలకు అదుపు లేదు...నా కన్నీటికి లెక్క లేదు..
ఏ సద్దు లేని ఈ ఏకాంతంతో నా గోడు చెప్పుకుంటుంటే నిండు కుండ లా తొణక్కుండా వింటుంది...
మూడో కంటికి కనిపించని నువ్వు ఆడిన ఆటను గొంతెత్తి గుండె లోతుల నిండిన దుఃఖాన్ని బయట పెడుతుంటే శూన్యమై నన్ను చూస్తుంది...
నిస్సిగ్గుగా నువ్వు రచించిన కేళిని నా కళ్ళలో చూస్తుంది చాలింక చెప్పకంటూ...
నింగి నేల మధ్య నేనున్న నువ్వు వదిలిన త్రిశంకు స్వర్గాన్ని ఏలుతూ...
మనసులతో ఆటలు.. నువ్వు గెలిచిన మనసు ఓడిన చప్పుడు నీకు తప్పించి ఎవరికి కనబడదు,వినబడదు కదా...
విజేతవే నువ్వు ఒక మసును జీవచ్చవాన్ని చేసి ....నువ్వు ఆ మనసులో చచ్చి గెలిచిన గెలుపు అది...
రెండు శరీరాలు కలిస్తే తీరే ఆకలి కోసం మనసుకు ఆయువునిచ్చే ప్రేమను పణంగా పెట్టేసావు...
ఒకసారి శ్వాసను నిలువరించి చూడు ఎలా ఉంటుందో...మనసు మోసపోతే అలాగే ఉంటుంది....
ఆ సంగతి నీకు ఎప్పటికి అర్థం కాదు అయినా కూడా అది నీ మనసు కాదు కదా...
చెమట చిందించి మరీ కష్టపడ్డావు కదూ... సేద తీరు ఇంకొక ఒడిలో మరో ఆటకు సిద్దమై...
ఆత్మస్తుతి ఎప్పుడు చేసుకోకు అక్కడ అది లేదని తెలిస్తే నువ్వు మనిషిగా పోయి చాన్నాళ్ళు అయిందన్న నిజం తెలుస్తుంది ఆణిముత్యం...
✍️అరుణిమలు
No comments:
Post a Comment