పరవశాల ప్రాంగణమే నీ వలుపల ఒడిలో... మైమరుపుల విరుపులే మది ముచ్చట్లలో... వెలితేది నీ తలపులకు... వేతనమిదే ఈ వయసుకు... వెతలన్ని వెలుగులకు వదిలేసి... కాటుక కన్నుల మాటున దాగిన.. నీ కౌగిలింతల చెరలో నే బందీనైతే... మురిపాల పెదవులు విరుపులను ఒలకబోస్తున్నాయి... జగమంతా చీకటే నీ ఊపిరి చెప్పే ఊసులలో నే ములిగిన వేళ... తనువంతా వసంతాల వయ్యారాలే మరి... ఎదురపడని ఈ వెతలతో దాగుడుమూతలు ఎన్నాళోయ్... పిడికిలిలో నువ్వనే ప్రపంచం చేరిందేమో... దూరమంతా కరిగిపోతుంది... తాపమంతా తరిగిపోతుంది... ప్రేమ మంత్రం మనసును మాత్రం వదలనంటుంది... ఓయ్.....తనివి తీరని తపనవి నువ్వు... తరగని,తరలి పోని తాపత్రయం నువ్వు... తలుపులు లేని తలపుల తొలకరివి నువ్వు...
✍️అరుణిమలు
No comments:
Post a Comment