కాలం వెనుకకు పరుగులు తీయలేదు....
కానీ, ముడి వేసిన బంధాలను తెంచి....
మునపటి చోటుకు తీసుకువెళ్ళి వదిలేయడం చూస్తే.... గతంలోకి పోయానా అనిపిస్తుంది....
అంతు చిక్కని ప్రశ్నల పరంపరలో....
సంతృప్తి లేక కొట్టుకు పోయే జవాబులు ఎన్నో....
జల్లెడ పట్టిన చేతికి అందని కారణాలు ఒకపక్క...
చేజారే వాటి కోసం దేనికే ఇంత ఆశ అనుకున్న....
ఆవేదన మాత్రం వెంటాడుతూ ఉంటుంది...
నవ్వుల దారులలో ప్రయాణాలు...
నిట్టూర్పుల ఊతకర్ర చేతపట్టి...
ఏ మనసెనక ఏ అగాధం ఉందో...
ఏ నవ్వు చాటున ఏ దుఃఖం ఉందో...
తాకిన చేతికే తడి అంటేది...
చూసే కళ్ళకు ఎన్నో ఆనందాల అందాలు...
✍️అరుణిమలు
No comments:
Post a Comment