ఎవరు నువ్వు.... అనే ప్రశ్న కొన్ని లక్షల సార్లు సందించుకున్న....
ఏ ఋణానివని వెతుకుతూ నా గడపన కాలు మోపావు !?
ఏ ఆశల దాహాం నా గుమ్మం దారి నీకు చూపించింది..!!
ఏ ఇష్టం నిన్ను నన్ను పెనవేసింది..!!
ఏ అవసరం నిన్ను నా ముంగిలికి ముడుపు కట్టింది..!!
ఏ ఆటకు తోడు కావాలని నా దడి దాటి వచ్చావు..!!
బాటసారి వై వచ్చి బందాన్ని పెనవేసి..!?
భరోసా ఎరుగని దారిలో నడిపించి...
బదులు దొరకని ప్రశ్నలను కానుకగా ఇచ్చి..!!
మరుపు ఎరుగని మనసులో.... మానని గాయమై వెనుతిరిగి చూడకుండా పోయావు....
అవును ఎవరు నువ్వు ????
ఎందుకొచ్చావు ????
✍️అరుణిమలు
No comments:
Post a Comment