Friday, 2 February 2018

తాను నేను

కన్నీటిని చదివావా ఎప్పుడు అయినా..
తడిమి చూసావా కనీసం..

తడంటిన చెంపను తాకి చూసావా..
ఆ వెచ్చదనం నిన్ను అంటి ఉంటే...
నీ గుండె లయతప్పి తల్లడిల్లడం ఏంటో నీకు అర్ధమయి ఉండేది..

చెమ్మ అంటిన వేళ్లతో నీ పెదవులను నిమిరి చూసావా..
నీకు లేని విశ్వాసాన్ని రుచి చూపిస్తుంది..

ఆ ఉప్పునీటి ఊటను చూసావా కనీసం..
కనికరం మరచిని కసాయి మనసు కూడా కకావికలం అవ్వక మానదు..
కనిపించని ఎద కోతలు వేడి ఊపిరుల మధ్య ఉసూరమనిపిస్తూ హ్మ్...

ఎప్పుడు అయినా చేసిన పనులను కాదు...
తగిలిన గాయాన్ని అయినా గుర్తు చేసుకొని ఏడ్చి చూడు అర్థం అవుతుంది ఏమో...
గాయపడ్డ మదిలో రగిలే మారణహోమం గురించి
తెలుస్తుంది ఏమో కదా ఏడ్చి చూడు..‌.

✍️అరుణిమలు

No comments:

Post a Comment