Friday, 2 February 2018

తాను నేను

ఆకసానివి నీవు...దరికి చేరితే శూన్యానివే
వర్షించే చినుకువే‌....తాకిన తమకం నుండి తేరుకునే లోపు తడారిపోతావు...

నే నడయాడే నేలవి నువ్వు...నా వెంటే ఎక్కడికి పోయినా
ఒక అడుగులో కలిసి మరు అడుగులో దూరమవుతూ...

నా కలల సరోవరంలో నను వీడని తోడువి...
నిజమని తలచి కళ్ళు తెరిస్తే కరిగిపోయే కలతవు...

నీడవే నువ్వు పగటి నవ్వులకు జతకట్టి..‌.రేతిరి వేళ్ళలో నను నీ దుఃఖానికి అప్పజెప్పే నీడవు...

అవును....నువ్వు ఏంటిప్పుడు నాకు అంటే...
శ్వాసను నింపే ఆయువువి...
రూపు లేని...చేతికందని వాయువువి అంతే...

అంతటా నువ్వే..........
ఎక్కడని మనసు అడిగితే మౌనమే సమాధానం...
నీ చిరునామా నువ్వు అడుగుతావేం అని దబాయింపు...

ఎక్కడ నుండి వచ్చావో....ఎటు పోయావో కానీ
నీ జాడలు మాత్రం నే చెరప లేకున్న...
జపిస్తున్న నీ పేరునే....
నాలో కలుపుకుని మరీ...

✍️అరుణిమలు

No comments:

Post a Comment