Friday, 2 February 2018

తాను నేను

చీకటిని చీల్చే ఆశవు నువ్వు...
వేకువను కరిగించే కోరికవు నువ్వు...

వేకువజామున పొడిచే తారవు నువ్వు నా మదిలో...
పొద్దు పొడిచే దిక్కున నిలిచిన పేరంటాన్ని నేను...

పవిట చెంగున కట్టిన ఆరో ప్రాణానివి...
పడమటింట పండిన నా పంటవు నువ్వు...

గూళ్ళు చేరే గువ్వల కంట పడని జంట మనం...
మది మందిరానికి అంతరంగం చెప్పే భాష్యం ఒకటే మనం అని...
ఒకరికై ఒకరం ఆరాదించడానికి అంకురించిన మొలకలం...

✍️అరుణిమలు

No comments:

Post a Comment