Wednesday, 8 August 2018

తాను నేను

నిలువరించగలనా నీ‌ ధ్యాసలో‌ మనసు పడితే..
ఆజ్ఞాపించగలనా నీ వేపు చూడోద్దని నా చూపులను..

అదుపు చేయగలనా నా అడుగులను నిను చేరకముందే..
నువ్వు ఎదురైతే‌ అద్దంలో చూసుకున్నట్టే ఉంటాయి నా చేతలు..

ఈ కష్టమెంత ఇష్టం చేసేసావో నువ్వు వ్యసనంగా మారి నాలో‌..
నిండు కుండనే తొణికిసలాడుతూ నీ తలపులలొ..

ఎందుకో ఆ నిలువరింత...ఎందుకు ఈ హద్దులు అంటావా..!?

నువ్వు నిజానివి అయితే కదా...
తెల్లవారుజామున వచ్చే కల‌ లాంటి వాడివి...
నిజమౌతుందేమో అనే ఆశ చావదు..నిజం కాదనే నిజాన్ని మనసు ఒప్పుకోదు..

కరిగిపోతావేమో అనే భయం..
కరగకూడదు అనే తపన...
కరిగితేనో అనే చింత...

ఏముంది రా నీలో
అసలు ఎవరు నువ్వు
నన్ను అదుపు చేసేటందుకు..

✍️అరుణిమలు

No comments:

Post a Comment