Wednesday, 8 August 2018

తాను నేను

ఏ తుంటరి చినుకై తాకావో
తనువుకు అంటిన తడి ఆరనంటుంది..

ఏ చిలిపి పలకరింపును విసిరావో
పెదవి పలుకులే మరచింది..

ఏ వాడి చూపుతో కబురంపావో
కళ్ళల్లో సిగ్గుల పంట కోతకి సిద్ధ పడింది..

ఏ కోరికను విన్నవించావో
ఎద పులకరింతల దారిగా మారిపోయింది..

ఎన్నాళ్ళకు గుర్తుకు వచ్చానని
మది మారాం చేయ మంటుంది..

కనుబొమ్మల నడుమ సింధూరమై నిలిచిపోయింది
నీకై నా ఎదురు చూపులు..

కనుల పందిరి నీడన
కలల కోరికలకు శ్వాస పోసావు నీ రాకతో..

చల్లని రేయి...
వెన్నెల హాయి...
ముస్తాబు అయ్యింది
వింతైన మన లోగిలి..
ఇలా ఇవ్వాళ..😍😍

✍️అరుణిమలు

No comments:

Post a Comment