Wednesday, 8 August 2018

తాను నేను

నువ్వో అతిధివి
కలిసి బతక లేని బతుకు బాటలో ఒక మజిలీవి..

బతుకంతా నీకు బంధీనే
బంధనాలు లేని దాసిని కూడా..

నువ్వు కావలి కాసేవాడివే నా ఎదలో
నువ్వు నిదరోవు నన్ను నిదరోనివ్వవు..

ఏడడుగులు పడని సహచర్యం మనది
ఒకరికొకరం దాసులమే..

క్షణాల కలియికని
యుగాలుగా మోసే మేధావులం..

ఆవహించిన మనమనే మైకంలో తూలే తాపసులం
దాసోహమే దారి తెలియని మన పయనానికి..

అడగక వచ్చిన అతిధి వే
అడిగి మరి తెలిపిన వీడ్కోలు వే..

రాజీనామా లేని ఈ బంధంలో
ఒకరికై ఒకరు రాసిన వీలునామాలు ఎన్నో..

ముడి పడని బంధమే మనది
కానీ ఈ ఆత్మ వేసిన ముడి విడి పడను అంటుంది రా..

✍️అరుణిమలు

No comments:

Post a Comment