నను తాకేందుకు నీకెందుకు ఇంత తొందర
ఒళ్ళు జల్లు మనిపించేలా
నీ తాకిడిలో ఏముందో..
నీ చూపులు తడిమేసినట్టే ఉన్నాదోయ్
అణువణువు తడిపేస్తున్న ఈ చినుకులు..
నన్ను బంధించేయ్ అంటూ
ఆహ్వానం ఇచ్చేసా..
హత్తుకు పోతావో..ముంచెత్తుతావో
తాకిడిలో చిరు గాయాలను
చిలిపి చేతలతో చెరిపేయ్ వోయ్..
ఓయ్ నిన్నే... శతకం, పతకం నాకేం ఎరుక
ఏరువాకలో ఉన్న వయసుకు ఉరకలే తెలుసోయ్..
మాది కవిత్వం కాదు అంటారా ఇప్పుడు 👊👊
✍️అరుణిమలు
No comments:
Post a Comment