మనుషులు ఎంత దగ్గరైతే
మనసులు అంత సున్నితమై పోతాయి ఏమో..
చిరునవ్వును చిరునవ్వు పలకరిస్తుంది
కానీ చిన్న చిరాకు మధ్యలోకి వచ్చిన చాలోయ్
కోత కోసినట్టు ఉంటుంది ఈ మనసు..
నీకోసం నిరీక్షణ కూడా ముస్తాబు అవుతుంది
కంటికి కంటికి మధ్య గడపలో
ఎరుపు చుక్కై పండిపోతా..
అల్లరికి కొదవ లేదు నీ ముంగిటిలో
ఉఫ్ అంటే ఉలిక్కిపాటుకు కూడా..
దూరం అవుతావని భయమా
దూరం అయితే
అనే ఆలోచనే భయపెడుతుంటే..
నాలో నేను నీతో ఎన్ని ఊసులో
నాతో నేను నీకోసం ఎంత సంఘర్షణో
నీలో నేను నీకు ఎవరనే ప్రశ్నలెన్నో
నా నవ్వులలో నలిగేది నువ్వే
నా కన్నీటిలో ఇంకేది నువ్వే
ఎవరివోయ్ నువ్వు..
ఏమౌతావు ఇంతకు..
✍️అరుణిమలు
No comments:
Post a Comment