Wednesday, 8 August 2018

తాను నేను

చూడకూడదంటు నీవేపు చూడటం నాకలవాటు...
చూసినా చూడనట్టు ఉండటం నీకలవాటు...

దాగుడుమూతలు ఆట ఇది...
మనవి చేసే విన్నపాలు వినపడవే ఇద్దరికి...

పట్టువిడుపులు పట్టించుకోము...
పట్టనంత దూరం జరగము...

ఓయ్.. అంటే ఏయ్.. అనే అంత దూరమే మనది...
ఏరా.. అంటే పోవే.. అనేంత దగ్గరేగా...

బాగుంది...
ఆట విడుపు ఆటలు
కానీ....ఇవన్నీ నాణానికి ఒకవేపే సుమీ..

✍️అరుణిమలు

No comments:

Post a Comment