Wednesday, 8 August 2018

తాను నేను

నీపై అభిప్రాయం మారొచ్చు
ఇష్టం మారవచ్చు

నీకు చెప్పే తీరు మారవచ్చు
చూపించే తీరు మారవచ్చు

మన మధ్య దూరం రావొచ్చు
అసలు మనం అనే మాటే పలకక పోవచ్చు

కానీ నీ స్థానం మాత్రం ఇక్కడ మారదు
అంతేనా అంటే అంతే...

✍️అరుణిమలు

No comments:

Post a Comment