Wednesday, 8 August 2018

తాను నేను

నీ గురించి నా ఆలోచన ఖాళీ అనిపిస్తుంది
నిజమే నా..

ఆ శూన్యంలో నే పూరించలేని ఏ బరువు ఉందో..
ఆ చీకటిలో కడుపు నింపుతున్న నీ ఙ్ఞాపకాల కన్నీళ్ళు ఎన్నో..

నిజంగా కాళీ ఏనా అది...
బరువెక్కిన మనసుకు కమ్మిన మైకమా...

ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి
సమాధానం కోసం కళ్ళు మూసి ఉన్న,
తెరిచిన చీకటే కనికరిస్తుంది...

నా మనసులో నువ్వు ఒంటరిగా ఉన్నావనే
బాధ నీది....
నిలకడ తక్కువ కదా బయటకు దారేది అంటున్నావు..

నీ ఎదలో ఓ మూలన సర్దుకోలేని కష్టం నాది...
నాదంటు అనుకున్న నా చోటుకు
వచ్చి పోయే వారిని చూస్తుంటే..

హ్మ్....ఈ లోకం ఎవరి సొంతం కాదు
ఏది శాశ్వతం కాదు కదా..
మరెందుకు ఈ మనుషులకు ఇంత పిచ్చి
నా వాళ్ళు నాకే సొంతం అని..

నాది కాదన్న నీపై అధికారం ఇవ్వడం
ఎందుకు...
ఆనక నేను ఏ ఒక్కరి సొంతం కాదని చెప్పడం
దేనికో...

✍️అరుణిమలు

No comments:

Post a Comment