Wednesday, 8 August 2018

తాను నేను

తెంచిన తెగని బంధాలు
తుంచేయాలనే తపనే కానీ
తాకడానికే తడబడుతుంది...

ఆవిరవుతున్న కన్నీళ్ళు
సంధిస్తున్న ప్రశ్నలు ఊపిరాడనివ్వడం లేదు..

చెరిసగమని పెన వేసుకున్న మనసులు
చెరి సగమై చెరో తీరాన నిలిచాయి...

ఇష్టమై గడచిన కాలం
ఎన్నో ఆశల వాగ్ధానాలు
శూన్యంలా కనిపిస్తుంది నేడు..

నీ తలపులు ఆకశంలో ఆ తారలన్ని
రాలుతున్న నా ఆశలే ఆ తోకచుక్కలు..

గతమంతా ఙ్ఞాపకమై గోప్యంగా
మిగిలిపోతుంది ఈ మది గదిలో...

సుడిగుండాలే నీ ఆలోచనలు
బయట పడే దారేది...

రాకపోకలన్నీ నీ ఆదీనమే
నిర్దయగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటే
మౌనాక్షరాన్నై నే పలుకుతున్న..

ఈ పదాలకు అర్ధాలు లేవు
నీపై ప్రేమకు అంతం లేదు
నీకై నిరీక్షించడానికి అలుపు లేదు
నువ్వు చదవని ఈ మనసులో
నీకై ఉన్న భావాలకు కొదువ లేదు

✍️అరుణిమలు

No comments:

Post a Comment