Wednesday, 8 August 2018

తాను నేను

గ్యారంటీ లేని వస్తువులతో సహజీవనం
ఫలితమేమో..!!
బంధాల నడుమ గ్యారంటీ లేకుండా
పోయింది..!!

నిన్నటి నమ్మకాలకు...ఒకనాటి చిరునవ్వులకు..
నిన్నటి ఇష్డాలకు...ఆనాటి అలవాట్లకు..
ఎక్కడ ఉంది గ్యారంటీ...!!

మాటకు లేదు..
మనసుకు లేదు..
అభిప్రాయానికి లేదు..
నువ్వు ఇచ్చిన వాగ్దానాలకు లేదు..!!

మనం అనే రెండక్షరాలకు
ఎక్కడ ఉంది గ్యారంటీ..!!

అందుకేగా
నేను అనే చోటుకు చేరింది మళ్ళీ..!!

మాటలు వేరు
చేతలు ఇంకా వేరు..!!

నీ ముందు తగ్గడమంటే
నా విలువ తగ్గించి లొంగడం కాదోయ్..!!

నీ విలువను నాదిగా చేసుకొని నిలబడటం..
ఎందుకంటే.... నా విలువ ఏనాడో
నీది అయిపోయింది కనుక..!!

ఇది నీకు అర్థం కానంత వరకు
ఎవరికి ఎవరమో మనం...!!!

✍️అరుణిమలు

No comments:

Post a Comment