Saturday, 9 November 2019

తాను నేను

ఇష్టం బరువు ఎంతంటే
నీ అంతేగా అనే నీ ఒడుపు మాటలు..

పొదుపే లేని నీ ప్రణయంలో
పొదివి పట్టుకునే నీ చేతులలో బంధీనయ్యా..

పాలించే ఎదలో గుబులు రేపి
పరువాల వేటలో విజేతవై నిలిచావుగా..

సాగర తీరంలో మరో సంద్రమై
నువ్వు కల్లోలానికి సిధ్దమంటే అలలే ఉలిక్కి పడ్డాయి..

గొడుగై నిలిచిన ఆకాశానికి
ఉలుకొచ్చిందా
మనల్ని తడిపేద్దామని త్వరపడుతుంది..

ఇసుకు రేణువుల పానుపులో
మరో ఙ్ఞాపకాల గూడు కట్టేసుకుందాం..

కోరికల తీరానికి ఎన్ని ఒంపులో
కోతలు పాలవతున్న దేహంలో అన్ని వింతలు..

కలిసిపో ఈ మనసులో
కరిగిపోతా నీ కౌగిలి నీడలో..

✍️అరుణిమలు

No comments:

Post a Comment