Thursday, 14 November 2019

తాను నేను

నీ మీద ఉన్న ప్రేమ
ఇంత బరువుగా ఎప్పుడు మారిందో...

మరుపుకు రానంటుంది
భారం మోయలేనంటుంది

దూరాన్ని హత్తుకోమంది
వెనుతిరిగి చూడకంటుంది

మనసు గొంతు నొక్కేసి
మౌనమై మిగిలిపో అంది

కన్నీరు కూడా చప్పుడు చేయడం లేదు
నీకై చూసి చూసి అలసిన కనులకు ఊరటగా మారినందుకు ఏమో..

మరో లోకం నాకు తెలియదు
నేను ఉన్న ప్రపంచం అంతా నువ్వే అని
ఈ ఎదకే తెలుసు..

నీ ముందు నా మనసు ఓడిపోలేదు
నా నిరీక్షణ ఓడిపోదు

కానీ....నువ్వే గెలిచావు
నన్ను పోగొట్టుకుని
నీకు కావలసిన ఏకాంతాన్ని గెలిచావు

✍️అరుణిమలు

No comments:

Post a Comment