అలిగిన కలల్లో
నీ అలికిడి ఏది..
మనసు ఒళ్ళంతా
కళ్ళు చేసి ఎదురు చూస్తుంది..
నింగిలో చుక్కలన్ని
నువ్వు ఉండే చోటిదని
దారి చూపిస్తుంటే...
కలత నిద్రలో
నీకై నా కలలు వెతకని చోటేది..
తలగడ దీవిలో
నా తలపుల కథలు ఎన్నో
నిశ్శబ్దంగా పయనిస్తున్నాయి..
చిరుగాలి విసుర్లన్ని
నీ రుసరుస లను గుర్తు చేస్తుంది..
నా కనుల
నవ్వులలో నువ్వు కనిపిస్తూ..
నా పెదవి పలుకులలో
పూతరేకువై తీయంగా చేరావు..
విశ్వంలో ఓ తారనే
శూన్యమైన నీలో నా రంగుల ఆశలను వెతుకుతూ..
అనంతమైన
నీలో నా చోటును శోధిస్తున్న..
✍️అరుణిమలు
No comments:
Post a Comment