Thursday, 14 November 2019

తాను నేను

నువ్వు వదిలేసిన ఏకాంతంలో
నిన్నే వెతుకుతుంది ఇంకా ఈ పిచ్చి మనసు...

ఓదార్చే వారు లేరు
ఓర్చుకోమని నా చేయి నన్ను తడుతుంది..

మాట్లాడాలి అంటే భయం
ఏ గొడవ వస్తుందో అని...

మాట్లాడకూడదు అనుకున్న
నీ పిలుపు విన్న మనసు ఆగదే
బదులు ఇవ్వకుండా..

దూరంగా ఉందామంటే
ఎదలో ఏదో తుఫాను రేగుతుంది..

ఒంటరి క్షణంలో
నన్ను వేదించే నీ ఆలోచనలు ఎన్నో..

ఎలా చెప్పను...
దూరంగా ఉండలేని
దగ్గర కాలేని
నిన్ను మరచిపోలేని నా స్థితిని..

నా కళ్ళతో చూడగలవా
నా స్థానంలో ఉంటే కానీ తెలియదు
విప్పి చెప్పలేని ఈ మనసు గతి..

✍️అరుణిమలు

No comments:

Post a Comment