చెప్పాలి అనుకున్నప్పుడు నువ్వు లేవు
చూపించాలి అనుకున్నప్పుడు ఇటు చూడవు
అడగాలి అనుకున్నప్పుడు నువ్వు కనపడవు
చూద్దామంటే నువ్వు ఎటు ఉన్నావో తెలియదు
వినిపించేలా అరుద్దామంటే వినే దూరంలో నువ్వు లేవు
విసుక్కుందామంటే నువ్వు ఎవరో ఈ లోకానికి వినిపిస్తుంది ఏమో
అడుగేద్దామంటే పక్కన నువ్వు ఉండవు
కలగందామంటే కన్నీళ్ళు అడ్డు వస్తున్నాయి
నిజం ఏంటని అందామంటే మాట పెగలదు
అసలు నువ్వు ఎక్కడ ఉన్నావంటే
నా భ్రమ కూడా చూపించదు నాతో నిన్ను జంటగా
ఒంటరి ప్రయాణం...
నా జంటగా ఉన్నది నువ్వనే ఏకాంతమే ఎప్పుడు
ఇక నువ్వు వచ్చినా, రాకపోయినా ఇచ్చేందుకు, నొచ్చుకునేందుకు
నా దగ్గర మిగిలింది ఏం లేదు
నేను అనే శూన్యం తప్ప..!!
✍️అరుణిమలు
No comments:
Post a Comment