చెల్లాచెదురుగా పడిన నా మనసు ముక్కలను...
ఒకచోట పేరుస్తున్న...
మళ్ళీ ఒకసారి నీ రూపాన్ని చూడాలని
నిన్ను గుండెలకు హత్తుకోవాలని...
కుదురుతుందా
నా వలన అవుతుందా..
రెప్పవెయ్యనివ్వని
నీ ఆలోచనల పోరులో అలసిపోతున్న...
ఎందుకే నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటావు
నన్ను బాధ పెడతావు అంటావు...
తలొంచలేను,నప్పుకు పోలేను
నటించలేను, నిందించలేను..
వీటిన్నిటి కన్నా నన్ను నేను హింసించుకోవడం తేలికగా, హాయిగా ఉంటుంది..
నాతో నేను చేస్తున్న ఈ యుద్దంలో
ఓడిపోయి మరోసారి నిన్ను గెలుచుకోవాలని ఉంది..
నా చేతుల్లో పనే కదా
కానీ చేత కావడం లేదు రా..
ఎలా.....ఎలా...
నా అడుగులను నీ వేపుకు మళ్ళించేది..
✍️అరుణిమలు
No comments:
Post a Comment