Friday, 28 February 2020

తాను నేను

మనసును చీల్చే నీ మాటల పై 
ఎదురు దాడి చేయడానికి‌ 
నేను ఆయుధాన్ని కాలేను..

నువ్వ నా గర్వానివి కదు
అందుకే
మౌనాన్ని ఆశ్రయిస్తాను..

మనసు విరిగిన రోజే వస్తే 
నీ నుండి వెనుతిరిగి చూడలేనంత 
దూరం జరగడమే తప్ప తిరగబడలేను..

నా ప్రేమ ఇంతే దాని తీరు అంతే...
నిన్ను నొప్పించి నేను పొందేది అశాంతే కదా..

నా అభిమానం నీ అహం 
అనేది లేకుండా ఉంటే మనం మనమే ఎప్పటికి..

మూడో వ్యక్తికి కూడా అవకాశం 
ఇవ్వన్నంత నమ్మకం ఒకరి మీద ఒకరికి ఉంది..

కానీ అహం చేసే గాయాలకు
అభిమానం పదే పదే తలొంచలేను అంటుంది..

నీ అహాన్ని జయించలేను
నా అభిమానాన్ని వదిలేయలేను..

అందుకే 
మనసు వనవాసాన్ని కోరింది ఇలా..

✍️అరుణిమలు

No comments:

Post a Comment