అప్పుడే సంవత్సరం అయ్యిందా అనిపిస్తుంది
నిన్ను కలిసాక కాలానికి ఎందుకు ఇంత తొందర అనుకున్నాను
ఇప్పుడు కాలం ఇంకా తొందరగా పరుగు పెట్టి నా కాలం ముగిసిపోవాలని
ఋతువులు ప్రభావం లేదు కాని నీలో ఉన్న అనాకనేక అలవాట్లు నాతో ఆడుకుంటున్నాయి
సంతోషంగా గడిచిన రోజులు ఎన్నో వేళ్లమీద లెక్క పెట్టేయొచ్చు
నీ అలవాట్లు నీ నిజాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలైన రోజు నుండి మొదలైన నా కన్నీటి ప్రవాహానికి ఆనకట్ట ఈ రోజుకు వేయలేకపోతున్నాను
దూరంగా ఉండి ఒక రకమైన యాతన
ఎదురుగా ఉంటే నీ నిర్లక్ష్యం
మరి ఏం చేయను దూరంగా ఉన్నా ఎదురుగా ఉన్నా నాకు తప్పని నీ యాతన నుండి ఎలా బయటపడేది
నా సంతోషం నువ్వే దుఃఖం నువ్వే మరి నేనెవరిని ఒక అవసరాన్ని
ఇప్పటి వరుకు జీవితం నేర్పిన పాటాలు వేరు నువ్వు నేర్పినవి వేరు
ఇంత మనిషి, మనసు విలువ తెలియని నీలాంటి వాడిని ఎందుకు రానిచ్చాను,ఎందుకు ఇంతగా ప్రేమించాను
అవసరం ఉన్నరోజు మాటల సునామీ
అవసరం తీరగానే బై అంటావు చూడు ఆ క్షణం ఎందుకు ఈ బతుకు అనిపించేది
మర్నాటి నుండి నీకు అప్పుడప్పుడు అవసరమైన ఈ శరీరం కూడా నీ కంట పడేది కాదు
మనసు చంపుకొని, అహంకారాన్ని పక్కన పెట్టి పలకరిస్తే వచ్చే పలకరింపు నిండా నిర్లక్ష్యం నిస్సిగ్గుగా నన్ను చూసి నవ్వుతుంటే ఎందుకు ఆడదానిగా పుట్టానా అనిపించేది
పలకరింపుకి పలకరింపు కూడా నోచుకోని ఎదురు చూపులు
నలుగురిలో ఆ నులుగురిలో ఒకదానిగా మాట్లాడినా నువ్విచ్చే విలువకి ఆ నలుగురిలో బతికి ఉన్నా చచ్చిన దాన్ని అయ్యాను
నువ్వు వెంట పడిన ఆ రోజుల నుండి ఎలా ఇప్పుడు నా నుండి బయటపడాలనే నీ యాతన కనిపిస్తుంది
నా స్వార్థం ఏంటి ఉందిక్కడ
ఏం పొందానని నీ నుండి, నిన్ను పొందాలనే స్వార్థం నాకు అసలు
ఈ ఎదురు చూపులు,అవమానాలు,నిర్లక్ష్యం వీటి కోసమా ఇదేనా నా స్వార్థం
నువ్వు ఈ రోజు కాకపోయినా రేపైనా వెళిపోతావు నా నుండి
చేతనైతే నువ్విచ్చిన ఈ దుఃఖాన్ని తీసుకుపోవా
నీకు తీసుకోవడమే కదా వచ్చు ఇవ్వడం నీకు ఎలాగూ తెలియదు
No comments:
Post a Comment