కాంక్షవో,కలవో లేక కన్నీరువో కళ్ళనిండా నిండిపోయావోయ్...
రెప్పవాలిస్తే ఎక్కడ చేజారి పోతావేమొనని
కనులను వాల్చడమే మరిచాను...
నాలో నన్ను కాకుండా నిన్ను దాచుకునేంత కాంక్షవి..
కలవే అలా వచ్చి ఇలా కలవరపెట్టి కరిగిపోతుంటావుగా..
క్షణానికో రకమైన విలువను ఇస్తూ, అంతలోనే ఆప్తుడువై ఆ మరుక్షణంలోనే అపరిచితుడువై నా మనసుతో ఆడుతూ నా కళ్ళలో ఇంకిపోని ఊటబావి అయిపోయావుగా...
రావడం, వెళ్ళడం అన్నీ నీ ఇష్టమే కదూ...
వచ్చి వెళ్ళే ప్రతిసారి ఎన్ని పాఠాలు నేర్పుతున్నావో ...
నా మనసైన నీకు విలువ ఎక్కువ ఇచ్చాను కాని కాసంత పొందలేకపోయాను తిరిగి ...
మాటల్లో నాపై ఎంత అభిమానమో...వెతుకుతున్నాను కాని అదేమిటో ఎక్కడా కనిపించదు..
పలకరింపు హ్మా..... మనసు నుండి వచ్చిన పలుకులు ఎక్కడ అని వెతుకుతునే ఉంది నా మనసు..
తడి ఆరని చారికలు ప్రశ్నిస్తున్నాయి ...ఇలా ఎంతవరకు అంటూ ....
అవును నువ్వూ ప్రశ్నించావు కదూ ఇంకా ఎందుకు నాతో ఇంత బాధపడుతూ అంటూ ...
అవును ఈ ప్రశ్న నన్ను నేను ఎన్ని వేలసార్లు వేసుకున్నానో...
నాలో నుండి వేరు పడుతూ నా భారాన్ని తనవంతుగా మోసుకుంటూ జారే ప్రతీ కన్నీటి బొట్టు ఇందుకు సాక్షి..
ఏం చేయను సమయాన్ని బట్టి మారిపోవడం చేతకాదే..
ఆ రోజు ఇష్టాన్ని చూసి ప్రేమించిన ప్రేమ ఈ రోజు మారిపొమ్మంటే ఎలా మారేది ....
మనసు విలువ తెలియని మనసుకు మనసిస్తే మనసుకు ఇంతకమించి ఏం దొరుకుతుంది దొరకదని తెలిసింది ...
ఆశించాను కూసంత విలువ చేతల్లో..అంతే కదా అదీ వద్దులే...పరాయి దానినే కదా నీ దృష్టిలో అలానే ఉండిపోతానులే. దూరంగా. ..
కఠినంగా ప్రవర్తించడం నిన్ను చూసి నేర్చుకోవాలి అనున్నా నాకు చేతకాని పని అది....అదీ నీ దగ్గర అలా ఉండగలిగితే ఇంత సొద దేనికి...
............అరుణని...........
No comments:
Post a Comment