Thursday, 20 April 2017

తాను నేను

నువ్వు చిత్రించిన నా మనసు ఇదిగో...
సడి లేకుండ పడి ఉండేది ఒకప్పుడు...
అలంకరణ ఎరుగనిది అదీ నాలాగే...
మదికి దారి తెలియనిది..
తనకి తానెవరో ఎరుగనిది...
నీ రాకతో రంగులద్దుకుని మురిసిపోయింది...
మనసు మనసుతో ముచ్చట్లు చెప్పడం మొదలయ్యింది...
తనని తానైన తలవని నా మనసు...
ఈ రోజు నీ ఆలోచన మరువనిది అయింది...
ఆశలన్నింటిని పోగేయటం మొదలుపెట్టింది...
నీకు తెలుసా ? నీకు తెలిసింది తక్కువేలే ఈ మనసు గురించి...
నీ పిలుపును నా మది సవ్వడిలో దాచుకున్న...
నీ శ్వాసను నా ఆయువుగా నింపుకున్న...
నీ పలుకులను నా ప్రేమ పత్రంలో లిఖించుకున్న...
నువ్వు చిత్రించిన ఈ చిత్రాన్ని నీ చేతులతో
ఛిద్రం చేసే శక్తి నీకుంది కాని...
నాలో ఉన్న నీకు బయటకు వెళ్ళే దారి నేను చూపించలేను...
జీవం పోసినవాడివి కదా నిన్ను పొమ్మనడం అంటే
నన్ను నేనే పోగొట్టుకోవడం కదా...
అలాగని నువ్వు నాకొద్దు..నేను ఒక అవసరంగా ఉండలేను నీ దగ్గర
ప్రేమించడం తెలుసు..ప్రేమించబడడం కూడా తెలుసు నీకు
ఆశలు పెంచడం తెలుసు..చిగురిస్తున్న ఆశలను తుంచేయడం తెలుసు
అలవాటు చేస్తావు నిన్ను..కాని అలవాటు చేసుకోకని ఒక సలహ పారేస్తావు
అనుభవం అంటే ఏంటో చెబుతావు..ఆ అనుభూతులను ఙ్ఞాపకాలుగా దాచుకోకు అంటావు
లోకాన్ని మరిపిస్తావు...అదే లోకంలో ఏకాకిని చేసి వదిలేస్తావు
పువ్వునై నిను పూజించాలి అనే నా ఆశకు,నేను తుమ్మెదని మాత్రమే అనే వాస్తవం చూపిస్తావు
మనసుని మురిపించడమే కాదు...నిర్దాక్షిణ్యంగా విరిచేయడం కూడ నీకే చేతనౌను
నిను పొంది... నేను పొందింది జల్లెడు కన్నీరు మాత్రమే
మొదటి రోజులలో నువ్విచ్చిన మత్తును..నువ్వే చిత్తు చిత్తు చేసి పడేసావు
మాటల్లో మాటవై నా పెదవిపై పొదువుకున్న నీ పేరుని ఎలా వేరు చేయాలో నేర్పించ కూడదు...గాయమైన ఫర్వాలేదు నువ్విచ్చిన ఎన్నింటిలోనో అదొకటి అంతేగా
నిను తలవని గడియను నేను ఎరుగను...నీకు తెలుపను కూడా
నేను రమ్మంటేనే వచ్చావా..నేను పొమ్మంటేనే పోయావా
ఏదో నేర్పడానికి వచ్చావు...నేర్పించేసావేమొ మరి వెళ్ళిపోయావు
అందరికి కొరకరాని కొయ్యను..నీకు మాత్రం వెన్నపూసను నేను
మన గాధ తుది వరుకు సాగకపోయినా..నాతో సాగుతునే ఉంటుంది
నిను తెలుసుకోనంత వరుకే, నీ దగ్గర ఎవరైనా మనగలిగేది
నువ్వేంటో తెలుసుకున్నాక కూడా నీతో ఉండటం అంటే
దినదిన గండమే...ఎన్ని గండాలను ఎదుర్కోగలనో ఏమో మరి

       .........అరుణని..........

No comments:

Post a Comment