ఏం కావాలి అంటే ఏమో అనే అమ్మాయిని నేను
కోరికలు ఏమి లేవా అన్నట్టు చూడకోయ్ వెటకారంగా
నా కోరకలన్ని నీతో మొదలై నీ దగ్గరే ఆగిపొతాయని తెలుసుగా
నాతో రాలేని ఆ కట్టలు,నగలు,ఆస్ధులు నాకెందుకోయ్
నీ సమయం నాకు కావాలి అందులో నేను భాగం కావాలి
ఇదేగా నేనెప్పుడూ నిన్ను కోరేది...నువ్వు తీర్చలేనిది
ఉదయాన్నే ఒక చిరునవ్వుతో పలకరింపు
నీ ఆకలి తీరాకైనా నువ్వు తిన్నావ అనే మాట
ఏం చేస్తున్నావు అంటూ ఒక పలకరింపు
చిన్న చిన్న ఆనందాలు అవి ఆనాటివేలే
ఎక్కడ వదిలేసావోయ్...మరచిపోయావా ...లేదా
అవసరం ఏముందిలే ఇప్పుడు అనే ధీమా కదా నీకు
నీతో ఏవేవో చెప్పుకోవాలి అనుంటుంది కాని వింటావు ఏదొ తప్పదన్నట్లు
ఒకప్పుడు ఏదో ఒకటి మాట్లాడు అని మరీ అడిగేవాడివి కదా
అవసరం లేకపోయినా సలహాలు అడుగుతాను నిన్ను కదిలించడానికి
తగువులు పడతాను నీతో... ఏం చేయాలొ నిన్ను తోచక
చిలిపి తగాదాలు ఇప్పుడు మన దరిదాపుల్లోనే లేవు కదూ
సాయంకాల సమయంలో నీ చేయి పట్టుకొని నీకు చేరువుగా నడుస్తూ నిన్ను ఆట పట్టించాలని...
ఒకప్పటి రోజులను గురుతు చేయాలని అనిపిస్తుంది
వెన్నెలను చూసి అంటుంటాను ఏంటోయ్ ఆ తళుకులు
నా చందమామ కన్నానా నువ్వు అని..
అడవికాచిన వెన్నేలేగా నా ఊహలు నీ కోసం..నువ్వు వచ్చేవరకు
మరి నువ్వోచ్చేది ఎప్పుడు అని అడగనులే తెలుసుగా నాకు
నీకు అవసరం వచ్చిన రోజునేగా నేను కనిపించేది అని
........అరుణని........
No comments:
Post a Comment