పరువాలన్నీ పరధ్యానం పాలు అయినాయి....
కళ్ళనిండా కలలే వాటికి పగలు రేయి అన్న తేడా లేనే లేదు...తీరేవి కాదు కదా
ఆలోచనలన్నీ నీకు అంకితం చేసేసానేమో కదూ...
కనీసం నాకై ఒక్క ఆలోచన కూడా కనికరించట్లేదురా...
ఎదురు చూపులకు అలవాటు పడ్డాయేమో ఈ కళ్ళు...
నీకోసం చూస్తూ చూస్తూ లోకాన్ని చూడటమే మరిచాయి...
పెదవిపై చిరునవ్వులకు కరువే లేదు...ఎదురుగా నువ్వున్నావనే మాయ ఈ మనసును కప్పేసింది కదా...
సిగ్గులు పూతలు చిరు చెక్కిళ్ళను తడుముతునే ఉన్నాయి...
నను నువ్వొచ్చి ఇప్పుడే తాకేవేమో అన్నట్టుగా....
మదిలో సవ్వడి తడి తాళమేస్తుందోయ్ నీ పేరును జపిస్తూ...నను తపిస్తూ
ఙ్ఞాపకాలలో బంధీనై పోయాను...నువ్వనే జీవిత ఖైదులో...
నేరం ఏం చేసాను...నీకు నేను ఎదురుపడటమే కదా
భవిష్యత్తు వేపు చూస్తూ... గతాన్ని తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతీ...నువ్వేలేవోయ్ అది
ఈ తీయని శిక్ష పడుతుంది అని తెలుసుంటే...నీ గాలి కూడా సోకనిచ్చేదాన్ని కాదు ఆనాడు...
నిను తప్పించుకొని పోయే దారి ఏదని వెతికి వెతికి అలసిపోయా....
ఓయ్...వస్తూ వస్తూ ప్రేమించడం నేర్పావు కదా...
మరి వెళుతూ వెళుతూ మరచిపోవడం నేర్పలేదేంటోయ్...
నీకొక తోడును వెతుక్కున్నావు, నాకొక తోడును చూడాలని తెలియదా...
ఇలా నీ లీలలు నను నీడలా వెంటాడటం తగునా...
మారిపోయాను అంటే సంభర పడ్డాను కాని స్థాన చలనంలో మాత్రమే మార్పు వచ్చిందని తెలుసుకోలేదురా...
ఎవర్నైనా నమ్మాలన్న నమ్మకాన్నే నమ్మకంగా చంపేశావురా....
ఏమిటో అందరూ నీలానే కనిపిస్తూ నమ్ముతావా అని అడుగుతున్నారు ఇప్పుడు...
అయినా ఈ ఎదురుచూపులకు ఏంటో ఇంత ఆశ.. ఇలా ఇంకా ఒక అతిశయోక్తి కోసం ఎదురుచూస్తూ....
..............అరుణిమలు..............
No comments:
Post a Comment