ఎంత కాంక్షను నింపుకున్నావో ఈ కాంత కోసం ఆ కళ్ళలో <3
ఆ చూపుల శరాలను తాళలేక నీ ఆకాంక్షను కనలేక నా చూపులు నేల చూపులు పాలైనాయి <3
తనువంతా పరవశించి పెదవిపై పూచే సిగ్గుల నవ్వును నీ కంటపడకుండా దాచేది ఎలా <3
నుదుటి రాతలు ఒకటైనాయి...చేతి గీతలు చిటికిన వేలుతో ముడిపడ్డాయి <3
నీలో భాగమై....నేనే నీవై.....మనమైనాము <3
ఏ కాస్త ఎడబాటు మనమైన మనకు రానీకోయ్ <3
ఈ దూర భారాల భారం కానుకను చేయకు ఎన్నటికి <3
ఈ బాసకు మన శ్వాసలే సాక్షి.... <3 <3
............అరుణిమలు............
No comments:
Post a Comment