Friday, 2 February 2018

తాను నేను

అటు, ఇటు కానీ ఆలోచనల మధ్యకు పోతూ ఉంటుంది మనసు....
భవిష్యత్తు గురించా అంటే, అటు చూడాలనే కోరిక లేదు...
గతం గురించా అనుకుంటే మరచిపోతే కదా...

ఆలోచనల అరుగు లపై ఆవలింతలు చేరే వరకు కాలక్షేపం చేస్తున్న...
మూసిన మనసు తలుపులు తెరిచి మరీ..లోపల ఎవరున్నారు అని అడుగుతా ఉంటా...

ఏవిటో...మనసు ఒకరి కోసమే తలుపులు తెరుస్తుంది..
ఆ వచ్చిన వారిని పంపేద్దామా అంటే...
ఈ మనసుకు తలపులే కానీ తలుపులు లేవని అబద్దాలు చెబుతుంది...

ఎవరివోయ్ నువ్వు అంటూ....
ఓయ్ అంటూ...
ఏయ్ అంటూ...
ఎలా పిలిచినా,ఎలా తలచిన నువ్వు అనే పరధ్యానమే పరమావధిగా మారింది ఇక్కడ...

తలంచితే పొలమారుతారు అనేది నిజమేనా అసలు...
నిజమే అయితే నా తలంపులకు..
నువ్వు కదిలి కదిలి కుదేలు అయ్యుండాలి...

అన్ని అబద్దాలే నీ మాటల్లా....
ఈ నమ్మకాలు కూడా...

రాసే కొద్ది రాయించుకుని.....నాతో అక్షింతలు వేయించుకునే ఓపిక నీకు, నాకు మామూలేలే....
చదివే వారికే నువ్వు, నేను అదే ఈ తాను, నేను అంతు పట్టని చిత్రమై కూర్చుంది...

✍️అరుణిమలు

No comments:

Post a Comment