నువ్వెక్కడ ఉన్నా నా ఆలోచనలు చేరేది నీలో..
అటుగా, ఇటుగా ఎటు సాగినా నే కలిసేది నీలో..
వద్దని అడుగులు ఆపినా...
మనసు ఉరకలేస్తునే ఉంటుంది నీలో ఐక్యమై పొమ్మని..
ఎవరు మనం ఆ సుదీర తీరంలో కలుసుకున్న నింగీ నేల..
లేదా నీలో లీనమై మనమయ్యే ఈ నదీ సాగరాలమా..
పయనం కష్టమే సుమీ విరహాల నడుమ...
మింగేసే దుఃఖాన్ని అదిమి పెట్టి...
ఆరాటాన్ని దాచిపెట్టి..
నీకై తపించె ఎదను తొందర పడకంటూ...
తరగని దూరాన్ని చేధిస్తూ...
ఆశలను కొంగు ముడి కట్టి...
నీలో నే కలిసే వేళ.....
మాటలకందని మకరంద సుగంధమే కదా..
మళ్ళీ మళ్ళీ నీలో కలసిపోయే క్షణాల కోసం...
ఎన్నెన్ని తపనల తపస్సు కైనా సిద్దమేనోయ్...
అలకల అలలకు...
ఊసుల ఉయ్యాల కట్టి..
దాచేసుకోవోయ్ ఎవరికి అందని లోతుల్లో...
✍️అరుణిమలు
No comments:
Post a Comment