ప్రశ్న నేనై మిగిలాను.....జవాబుగా నువ్వు కనిపిస్తుంటే..
చర్యలన్ని నీవైతే....అనుభవాలు నావి అయ్యాయి..
ఆలోచనలు నీవి.....ఆచరించింది నేను...
ఇష్టాలన్ని నీవి....ఇమిడిపోయాను అయిష్టంలో నేను ఇప్పుడు..
నయనాలు నావైనా....అందులో నడయాడే సంద్రానివి నీవు...
దాచేయాలని ఉన్న దాగని దుఃఖాన్నివి నువ్వు...
పెగలని పెదవి మాటున..దాగిన మౌనానివి నువ్వు...
దాచి దాచి నలుగుతున్న ఆక్రోశాన్ని ఆపలేనని అనిపిస్తుంది...
ఎన్నో రాత్రులు నన్ను అక్కున చేర్చుకొని సముదాయించాయి...
ఇంకా ఇంకా మిగిలే ఉంది...నువ్వు కోరి ఇచ్చిన కానుక..
మౌనంగా కారిపోతున్న దార కూడా జాలిగా చూస్తుంది..
మాటలు లేవా మాకు...చీకటి మిణుగురులమేనా మేమని..
ఒక్కసారి లోకాన్ని పక్కన పెట్టి...
పెదవి తెరిచి నీ పేరుకి నా దుఃఖాన్ని తిరిగిచ్చేయాలని ఉంది..
తనివితీరా తడబడిన అడుగుల గురుతులు చెరిగేలా ఏడ్చేయాలని ఉంది...
కానీ ఏదా శక్తి...ఉందా నాకు...
ఎవరో వింటారనే భయం కన్నా...
నీ పేరు పలికితే మళ్ళీ మనసు ఎక్కడ వసం తప్పుతుందో...మళ్ళీ నీ వేపు చూస్తుంది ఏమోనని...లేదా పచ్చిగా ఉన్న నా గాయాలలో లోతు పెరుగుతుంది ఏమో...అనే భయం భయపెడుతుంది...
✍️అరుణిమలు
No comments:
Post a Comment