తనువు సుఖంగా నిద్రిస్తుంది పానుపు పై...
మనసు మాత్రం దారి తప్పి పయనిస్తుంది..
ఎటో...ఏదో కావలసిన దానికోసం...
దాహమైన దేహాం వేపు చూస్తుంది వెనుతిరిగి...
పయనానికి కారణాలు ఏమో కానీ..
పలకరించే విషయాలు ఎన్నో..
కదిలించే కారణాలు అనేకం..
ఓదార్చే తీరం కోసం..
ఈ కలల నావలో ఒంటరి ప్రయాణం..
కాసేపాగని ఆరాటం...ఏదో చేజారినట్టు...
అంతలోనే సంతోషం..
మదిని తాకే అలేదో దప్పిక తీర్చినట్డు..
ఎక్కడ ఉన్నానో అని చుట్టూ చూస్తే..
ఆలోచనల సాలెగూడు అల్లికలలో చిక్కుకొని..
నన్ను ఆపేది ఎవరు ఇక్కడ...
విశ్రాంతి కోరిన దేహాన్ని నిద్రలోకి జో కొట్టి..
నటనను పక్కన పెట్టి జీవించడానికి..
రెక్కలు లేని పక్షినై పోరాడుతున్న ఎగరడానికి..
నేను రోజు చూసే రూపం...పలవరించే తోడు
ఎదురై వస్తుంది......ఏ సద్దు లేని చోటులో
పలకరింపులు...
నా మనసును మోసం చేయలేక, దాచిన ప్రేమను తన దోసిలి నింపి..
తన గుండెలను తాకిన నా ఊపిరి చెమ్మని...
మన మధ్య దూరాల భారానికి మరుగుతున్న గంగతో తుడిచేసి వెనుతిరిగి చూస్తూ...
యాతనని నా తోడు తీసుకొని నా ప్రాణాన్ని నీకాడ దివ్వెల వదిలేసి కదిలిపోతున్న..
మళ్ళీ మళ్ళీ వచ్చి నిన్ను కలుస్తునే ఉంటా..
జాగ్రత్త అంటూ..
✍️అరుణిమలు
No comments:
Post a Comment