Friday, 2 February 2018

తాను నేను

రాసేది నేనే..
రాయించేది నువ్వు..
నాలో నువ్వు చేసిన ప్రయాణం..
నీలో నేను చూసిన నిన్ను...
వెరసి మనం కాని నువ్వు నేను...

నిజానికి అర్ధానివి...
మాట మీద నిలబడను అనే మాటకు మారు రూపానివి..
వాడిన నా నవ్వులలో సువాసనవి...
నా కళ్ళలో కరగని రూపానివి...
ఆలోచనలలో అంతర్భాగానివి...
తీరని వ్యధవి...
తరగని భావాల సంపుటివి..

అవునూ....
ఇంతకు ఎవరు నువ్వు....

మనిషివే లే...
మాటల నీడలలో ముంచేసే మానవత్వాన్నివి..

అందుకే మరువలేని...మరుపు రాని...మణిషివి

✍️అరుణిమలు

No comments:

Post a Comment