నీ ముందర చిన్న పిల్లనే అలగడంలో..
జగడాలలో జాణనే..
ఇష్టంలో ఇమడలేని అల్లరిని..
ప్రశ్నించడంలో ప్రతి పక్షాన్ని..
అలరించే అందాన్ని...
నీకై తల్లడిల్లి పోవడంలో తాపసిని..
నీ ఒడిలో ఆడే ఓటమిని..
కరిగి నీ అరచేతిలో రాలే ఒక బింధువుని..
అవును నువ్వో తామరాకు మీద నీటి బిందువువి..
నిలకడలేని నిన్ను చూస్తూ...
మనసు చెమర్చిన..
పెదవులు నవ్వుతునే ఉంటాయి..
నీ నవ్వులకు జత కడుతూ...
✍️అరుణిమలు
No comments:
Post a Comment