నీకై మేల్కొనే నా ఆలోచనలలో ఎన్ని ప్రశ్నలో...
ఎప్పుడు అయినా నేను నీ తలంపుకి వస్తానా అని..
గాలి వాటుకి అయినా నా పేరు నీ పెదవిన చేరుతుందా..
ఏకాంతంలో నిను తడిమే చెలిమిని నేను అవుతున్నానా..
నీ ఊహలలో కనుమరుగైన గతంగానైనా నాకు చోటుందా..
గుండెల మీద చేయి వేసినప్పుడు అయినా, నువ్వు నాకు ఇచ్చిన కన్నీటి చెమ్మ నీ మనసును తాకుతుందా..
ఆదమరిచి నిద్రించే వేళ నా పలవరింతలు నీకు పలకరింపుగా వినిపిస్తున్నాయా..
నవ్వుకునే వేళ నీ నవ్వుని చూడాలని, నీ చుట్టూ తిరిగి నవ్వవా అంటు ఆటలాడిన రోజులు నిన్ను కదిలించలేదా..
బాగున్నావా,ఎలా ఉన్నావనే పలకరింపులలో నీ బాగు కోరుకునే మనిషి బాగు గురించి గరుతొచ్చిందా..
అబద్దాలు చెప్పే వేళ, నీ నిజాలను నమ్మి కుదురు పోయిన ఒక మనసు ఉందనే పశ్చాత్తాపం కలుగుతుందా.
..
హహహహ పిచ్చి మనసు కదా కోరి కోరి వచ్చి
...మనసుతో ఆడి, నా ఆట అయిపోయింది నువ్వు ఎవరో, నేను ఎవరో అన్న మనిషిలో ఏం మిగిలుందని..
నువ్వనే ఙాపకం ఉందా లేదా అని ప్రశ్నించుకుంటున్నావు..
అక్షరానికో చుక్క రాలుతుంది నీ నుండి ఎందుకో గమనించుకో ముందు..
నీ ప్రశ్నలకు జవాబులుగా వస్తున్న వాటిని తుడిచే చేయి నీదే..
కష్టం ఇచ్చిన వాడే తుడిచి పెడతాడనుకోకు..
కరిగి కావేరిగా మారితే నీలో మునకేసి తనను శుద్ధి చేసుకొని పోతాడు..
తేరుకో ఇక ఆలోచనల నుండి..
✍️అరుణిమలు
No comments:
Post a Comment