Friday, 9 February 2018

తాను నేను

చిరుగాలులకు ఏమని సెలవిచ్చావోయ్....
సవ్వడి లేకుండా నన్ను చేరి గమనిస్తున్నాయి....😍😍

నీ ఊహల వలె కంటికి చిక్కని ఈ గాలి
నీ శ్వాసను తలంపుకు తెస్తుంది
మైమరచిపొమ్మని....💘💘

ఈ చిగురాకుల కొనల తాకిడిలో
ఏముందోయి...😍😍
ఒంటికి తుళ్ళింత...కంటికి కలవరింత ❤❤

అలజడుల సుడులు సరి గంగ తానాలు ఆడమంటున్నాయి...💓💓
నీ సువాసనలు నిండిన ఆ గాలిలో
తడిసి ముద్దవుతుంది ఈ మనసు...💕💕

పెదవుల నుండి జారువాలని పదాలను
గాలిలో లిఖిస్తూ ఉన్న....✍️✍️

అందుకోవోయ్....అందని చిన్న దాని
భావాల బరువును....♥️♥️
పూరించవోయ్ మనం అనే వాస్తవాన్ని...💑💑

పత్రాల సాక్షిగా ప్రణయ లేఖలు ...💌💌
చిటారు కొమ్మన మిఠాయి పొట్లాలు కావోయ్...
ప్రేమాక్షర సుగంధాలు ఇవి...💗💗

✍️అరుణిమలు

No comments:

Post a Comment