Friday, 2 February 2018

తాను నేను

కలంలో కాలమనే సిరా నిండుతునే ఉంది నిండుకునే మాట మరచి
అనుభవాల సారాంశాన్ని లిఖించమని మదిని మదిస్తునే ఉంది
సిరా రంగు మారుతుంది ఎద లోతులలో నుండి కదిలే భావాన్ని బట్టి
కలం, కాగితం కవల పిల్లలు అయితే...అక్షరాలు నీవై వాటి నీడలలో మనం మిగిలాం....

అబద్దానికి, నిజానికి అర్థం నీవై...
మోహానికి, వ్యామోహానికి చిరునామా నీదై..
ఆటకు, చెలగాటానికి మధ్య నలిగే నిట్టూర్పుల పదాలివై..
నిను చిత్రిస్తూ.....నీ చిత్రాలను చూసి...
మురిసేటందుకు నువ్వు పూసిన పువ్వువా కాదే...
చిదిమేసే తోట మాలివి...

కాలం కదులుతునే ఉంది...
పూసే పువ్వులు పూస్తున్నాయి ...
చిదిమేసే చేతికి చిక్కేవి చిక్కుతునే ఉన్నాయి....
అటు అందాలు ఇటు శిధిలాల మధ్య...
ఓయ్ తోటమాలి...
వాసంతాల బట్టను కట్టి శిశిరాన్నివై రాజ్యమేలుతున్నావు...

కాలం మాత్రం కలగంటూనే ఉంది..నిన్ను సరికొత్తగా..
నా కలల సాగరానికి తెరచెపను చేసి..

✍️అరుణిమలు

No comments:

Post a Comment